Bhagavanth Kesari : బాలయ్య నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేనా..!

by Shiva |   ( Updated:2023-05-31 05:37:17.0  )
Bhagavanth Kesari : బాలయ్య నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేనా..!
X

దిశ, వెబ్ డెస్క్ : దర్శకుడు అనిల్ రావిపూడి, నటసింహ నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా 'ఎన్.బీ.కే 108' అనే టైటిల్ తో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇటీవలే చిత్ర నిర్మాతలు ఈ సినిమాను రాబోయే విజయదశమికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రానికి 'భగవత్ కేసరి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, ఈ వార్తను మూవీ మేకర్స్ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'ఎన్.బీ.కే 108' ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: దుల్కర్ సల్మాన్ 'కింగ్‌ ఆఫ్‌ కోత' షూటింగ్ పూర్తి..

దేవకన్యను తలపిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!

రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాలీవుడ్ షాక్..

Advertisement

Next Story