ఇండియన్ 2 ట్విట్టర్ రివ్యూ.. కళ్ళు చెదిరే విజువల్స్ తో టైటిల్ కార్డు

by Prasanna |   ( Updated:2024-07-12 02:31:24.0  )
ఇండియన్ 2 ట్విట్టర్ రివ్యూ.. కళ్ళు చెదిరే విజువల్స్ తో టైటిల్ కార్డు
X

దిశ,సినిమా: ఒకప్పుడు కమల్ హాసన్ సినిమాలంటే పనులు ఆపుకుని మరి వెళ్లే వాళ్లు.. దేశ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. పాత్ర ఏదైనా సరే దానిలో దానికి ప్రాణం పోయగల సత్తా ఉన్న నటుడు కమల్. కొంత కాలం ఫ్లాప్స్ పడ్డాయి.. ఆ తర్వాత విక్రమ్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టి తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. అయితే, ఇప్పుడు భారతీయుడు 2 తో మన ముందుకొచ్చాడు. ఈ మూవీ నేడు అనగా జూలై 12న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాని చూసిన అభిమానులు, ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇండియన్ 2 సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే శంకర్ మార్కు కనిపించింది. అనిరుధ్ మ్యూజిక్, విజువల్స్ హైలెట్ గా నిలిచాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. శంకర్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. 60 ఏళ్ళు దాటినా కమల్ హాసన్ లో ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీలో చించేశారు. సెకండాఫ్ లో ట్విస్టులు రివీల్ చేయడంలో శంకర్ సక్సెస్ అయ్యేడనే చెప్పుకోవాలి.. శంకర్ ఈజ్ బ్యాక్, ఈ మూవీని ఎవరూ మిస్ చేయెద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇండియన్ 2 మూవీ అయితే నాకు నచ్చింది. ముఖ్యంగా టైటిల్ కార్డు కి కూడా రేటింగ్ ఇవ్వాలి అంత బాగా విజువల్స్ తో డిజైన్ చేసారు. ఈ మూవీతో శంకర్, కమల్ సార్ కాంబినేషన్ హిట్ అని తేలిపోయింది. ఇది ఇద్దరికీ పెద్ద సక్సెస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed