- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పృథ్వీరాజ్ కొత్త కారు ధర ఎంతో తెలిస్తే.. షాకవ్వాల్సిందే..!
దిశ, సినిమా : మలయాళ చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పృథ్వీకి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన పృథ్వీరాజ్ ఇప్పుడు విలన్ గా కూడా మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. రెబల్ యంగ్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సాలార్ సినిమాలో పృథ్వీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
సలార్ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ది గోట్ చిత్రం బ్లాక్ బస్టర్ అయినా విషయం తెలిసిందే. ఇదే చిత్రం తెలుగులో ఆడు జీవితం పేరుతో విడుదలైంది. ఇక్కడ కూడా హిట్ అయింది. ఇదిలా ఉండగా.. పృథ్వీరాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ హీరో మరో ఖరీదైన కారును కొనుగోలు చేసారు. పృథ్వీరాజ్‌కి కార్లంటే పిచ్చి. ఇప్పుడు ఈ హీరో మరో కత్త కారు కొన్నాడు. పృథ్వీరాజ్ ఇటీవల పోర్స్చే 911GT3 కారును కొన్నాడు. ఈ లగ్జరీ కారు ధర రూ.3 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక సినిమాల విషయానికొస్తే సినీ ప్రియులు ప్రస్తుతం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఎంపురాన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ తెరకెక్కించిన లూసిఫర్ సినిమా సెకండ్ పార్ట్ ఇది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ గుజరాత్‌లో జరుగుతోంది.