వాటిపైనే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్.. అదే జరిగితే ఫ్యాన్స్‌ ఇక మస్తు ఖుష్ !

by samatah |   ( Updated:2023-08-12 13:57:21.0  )
వాటిపైనే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్.. అదే జరిగితే ఫ్యాన్స్‌ ఇక మస్తు ఖుష్ !
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాలను మేనేజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వారాహి యాత్ర చేస్తూనే ఒప్పుకున్న మూవీస్‌ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు. లేటెస్ట్‌గా ‘బ్రో’ చిత్రంతో అలరించిన పవన్ ప్రజెంట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ఫుల్ ఫోకస్ పెట్టాడట. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే రూమర్స్ వినిపించినప్పటికీ, ఏం జరిగిందో కానీ ఇందులో పొలిటికల్ సెటైర్స్‌కి మంచి స్కోప్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇటువంటి పవర్ ఫుల్ సినిమా‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని పవర్‌స్టార్ భావిస్తున్నాడట. అందుకే కంటిన్యూ షెడ్యూల్‌తో కంప్లీట్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్‌కి చెప్పగా, వీలైనంత త్వరగా పూర్తి చేసి, 2024 సంక్రాంతికి తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారు. దీంతోపాటు పవన్ అప్ కమింగ్ మూవీస్‌లో ‘ఓజీ’ కూడా ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకి కూడా ముహూర్తం కుదిరింది. ఈ చిత్రం విడుదల సైతం ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందే ఉంటుందని అంటున్నారు. అదే గనుక జరిగితే పవన్ ఫ్యాన్స్‌కి ఇక డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed