చెఫ్ కావాల్సిన వాడిని .. డైరెక్టర్ అయ్యాను: Tharun Bhascker

by Anjali |   ( Updated:2023-04-10 13:36:56.0  )
చెఫ్ కావాల్సిన వాడిని .. డైరెక్టర్ అయ్యాను: Tharun Bhascker
X

దిశ, సినిమా: టాలీవుడ్ యువ దర్శకులల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అనంతరం ‘పెళ్లి చూపులు’ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ప్రజెంట్ మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఎంచుకుంటూ దర్శకుడిగా మంచి గుర్తింపు పొందుతున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ భాస్కర్.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ‘నాకు చదువు అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. బీటెక్ చదువుతున్న సమయంలో నా వాలకం చూసి, నా స్నేహితులు స్టోరీస్ రాయమని సలహా ఇచ్చారు. అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి, ఇప్పుడు డైరెక్టర్‌గా స్థిర పడ్డ. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ డైరెక్టర్ కాకపోయి ఉంటే మంచి చెఫ్ అయ్యే వాడిని’ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read..

చనిపోయి కూడా కోట్లు సంపాదిస్తున్న సింగర్..

Advertisement

Next Story