Devara: 'దేవర’ హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే..?

by Prasanna |   ( Updated:2024-09-26 06:18:02.0  )
Devara: దేవర’ హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అభిమానుులే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీ కోసం ఏంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దేవర మూవీకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగింది. థియేట్రికల్ తో పాటు ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోయానని సినీ వర్గాల వారు చెబుతున్నారు. వరల్డ్ వైడ్ గా దేవర మూవీ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..

నైజాం - రూ. 45 CR

ఆంధ్ర - రూ. 46 CR

సీడెడ్ - రూ. 22 CR

కర్ణాటక - రూ. 15 CR

కేరళ - రూ. 0. 50 CR

తమిళనాడు - రూ. 06 CR

నార్త్ - రూ. 20 CR

ఓవర్సీస్ - రూ. 26 CR

ఇలా మొత్తంగా రూ. 180 కోట్ల వరకు దేవర ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దేవర మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ. 360 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. ఇక హిట్ కోసం రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను కలెక్ట్ చేయాలి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే దేవర హిట్ అయినట్టు అని సినీ వర్గాల వారు అంటున్నారు. దీంతో ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా పెద్ద టార్గెట్ ఉంది. మరి దేవర ఊచకోత ఎలా ఉంటుందో చూడాలంటే 24 గంటలు ఆగాల్సిందే

Advertisement

Next Story