పొన్నియిన్ సెల్వన్ హీరో జయం రవి విడాకులు?

by Sujitha |
పొన్నియిన్ సెల్వన్ హీరో జయం రవి విడాకులు?
X

దిశ, సినిమా : ' జయం ' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జయం రవి కొద్దికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్ గా 'పొన్నియిన్ సెల్వన్ ' తో హిట్ అందుకున్న ఆయన.. ఈ మధ్య పర్సనల్ ఇష్యూలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తన భార్య ఆర్తి రవితో విడాకులు తీసుకోబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. కానీ జూన్ 21న జయం రవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ పెట్టి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చినట్లు అనిపించింది. కానీ తాజాగా ఆమె సోషల్ మీడియాలో భర్త ఫొటోలు డిలీట్ చేయడంతో మళ్లీ డౌట్స్ షురూ అయ్యాయి. అసలు ఏం జరుగుతుందని అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. కానీ తన పేరులో భర్త పేరును ఇంకా అలాగే ఉంచడంతో హ్యాపీగానే ఉన్నారు.


కాగా ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురు అయిన ఆర్తిని 2009లో వివాహం చేసుకున్నాడు జయం రవి. వీరికి ఇద్దరు కొడుకులు కాగా ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ స్పెషల్ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యేవారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం విడిపోతున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి.

Next Story

Most Viewed