‘నీకు నమస్కారం’.. సాయిపల్లవి పై గరికిపాటి కామెంట్స్ వైరల్ (వీడియో)

by sudharani |   ( Updated:2024-01-25 10:06:57.0  )
‘నీకు నమస్కారం’.. సాయిపల్లవి పై గరికిపాటి కామెంట్స్ వైరల్ (వీడియో)
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సాయి పల్లవి నటిగా, డ్యాన్సర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ‘ఫిదా’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. కట్టు, బొట్టులో జూనియర్ సావిత్రి అంటూ ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ అమ్మడు. ఇక నాగచైతన్య తండేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. సాయిపల్లవిపై గరికిపాటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గరికిపాటి నరసింహారావు గురించి అందరికీ తెలిసిందే. ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు ఇచ్చే ఆయన.. సినీ సెలబ్రిటీల గురించి కూడా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవిపై కూడా ఆయన కామెంట్స్ చేశారు. ‘సినిమా రంగంలో చూసి మా అమ్మాయి లాంటిది అనుకున్న. సాయి పల్లవి మాటలకు నన్ను అంత ఆకర్షించాయి. ఎంత చక్కటి నవ్వు. మెల్ల మెల్లగా వచ్చింది క్రీమ్ బిస్కెట్ వేసింది. మొన్న ఆమె మాట్లాడుతూ.. ‘నేను అన్ని పాత్రలు ఒప్పుకోను. కథ విని నాకు తగినది అయితేనే చేస్తాను లేకపోతే వదిలేస్తాను. అంతే కాదు నేను ఎప్పుడు పొట్టి దుస్తులు వేయను. నాకు అవి సౌకర్యంగా ఉండవు. మా తల్లిదండ్రులు నా సినిమాలు చూసి గర్వించాలి. నా పిల్లలు కూడా గర్వంగా నా సినిమాలు చూడాలి. అంది’. నీకు నమస్కారం అమ్మ. నా కంటే చిన్నదానివైనా నీకు నమస్కారం పెట్టాలి తల్లి. నీలాంటి వాళ్లు సినిమా రంగానికి కావాలి’ అంటూ సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు గరికిపాటి నరసింహారావు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed