ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. పవన్ కళ్యాణ్‌ను ఉద్ధేశించేనా..?

by Kavitha |
ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. పవన్ కళ్యాణ్‌ను ఉద్ధేశించేనా..?
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండేది. కానీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ రాజకీయ నేతలపై, సినిమా హీరోలపై , డైరెక్టర్లపై వివర్శకంగా కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్ కౌర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

ట్వీట్‌లో భాగంగా.. నాయకుడు ఒక స్త్రీని ఎలా గౌరవిస్తారో అదే విధంగా వారి అనుచరులు కూడా గౌరవిస్తారు. నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దానిని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడు అని ఆమె రాసుకొచ్చింది. అయితే ఇక్కడ ఆమె ఎవరినీ ప్రస్తావించకపోయినా చాలా మంది పవన్ కళ్యాణ్‌ను ఈ వ్యవహారంలోకి తీసుకు వస్తున్నారు. ఈ పోస్ట్ కింద పవన్ కళ్యాణ్ పేరుతో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.


Advertisement

Next Story

Most Viewed