- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్నాళ్లైనా మళ్లీ అదే ఫీలింగ్ కలుగుతోంది.. రీ ఎంట్రీపై Esha Deol ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ ఈశా దేవోల్.. సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల వచ్చిన ‘రుద్ర’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటి ప్రాజెక్టుతోనే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. ‘అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించాలనే కోరికతో ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాక బ్రేక్ తీసుకున్నా. నా ఇద్దరు కూతుళ్లు నాకు రెండు కండ్లు. వారి ఆలనాపాలనతో కెరీర్‌కు దూరమైనా.. అమ్మగా లభించే తృప్తి మరే పనిలోనూ దొరకదు. ఇది ప్రతి మహిళకు బాధ్యతతో కూడిన వరం. అమ్మగా తీసుకునే నిర్ణయాలు కచ్చితత్వంతో ఉండాలి. మా అమ్మ నాపట్ల ఎంత బాధ్యతతో ఉండేదో.. నేను నా పిల్లల విషయంలో అలాగే ఉండాలని భావిస్తున్నా’ అని తెలిపింది. అలాగే చాలా కాలం తర్వాత సెట్స్ మీదికి వెళ్లినప్పుడు తన పుట్టింటికి వచ్చాననే ఫీలింగ్ కలిగిందన్న ఆమె.. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని, మంచి స్క్రిప్ట్, పాత్ర నచ్చితే తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ వివరించింది.
Also Read: ఆభరణాలకే అందం తెచ్చిన Sreemukhi.. ఈ డ్రెస్‌లో మెరిసిపోతున్నావంటూ కామెంట్స్