Elon Musk తో నటి ప్రేమ వ్యవహారం.. లైఫ్‌లో ఎక్కువ బాధను పొందింది ఆమె వల్లే..

by Nagaya |   ( Updated:2023-09-21 12:20:09.0  )
Elon Musk తో నటి ప్రేమ వ్యవహారం.. లైఫ్‌లో ఎక్కువ బాధను పొందింది ఆమె వల్లే..
X

దిశ, సినిమా : అమెరికన్ యాక్ట్రెస్ అంబర్ హర్డ్- హీరో జానీ డెప్ పెళ్లి, విడాకుల వ్యవహారం గురించి తెలిసిందే. ఈ టైమ్‌లో గందరగోళ జీవితాన్ని అనుభవించినట్లు జానీ కోర్టు ముందు కన్నీరు కూడా పెట్టుకున్నాడు. అయితే అంబర్ వల్ల ఇలాంటి జీవితం కేవలం అతనికి మాత్రమే కలగలేదని తెలుస్తోంది. వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్‌లో ఒకరైన ఎలన్ మస్క్ కూడా ఆమె బాధితుడిగా ఉన్నాడని సమాచారం. ఆయన బయోగ్రఫీ రాస్తున్న రచయిత వాల్టర్ ఐజాక్సన్ ఇందుకు సంబంధించిన వివరాలను ఓ పోడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. ఎలన్ మస్క్.. అంబర్ హర్డ్‌తో చాలా క్లోజ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, అయితే అతని తండ్రితో ఉన్న సమస్యాత్మక బంధం కన్నా ఇదే అతనికి ఎక్కువ బాధ కలిగించిందని తెలిపాడు. ఈ బిలియనీర్ డ్రామా అండ్ స్టార్మ్‌కు అట్రాక్ట్ అయ్యాడని అభివర్ణించిన ఐజాక్సన్.. అంబర్ వల్ల మస్క్ పడిన కష్టాలను వివరించాడు. ఇక 2016లో మెట్ గాలాలో కలిసినప్పుడు వీరి రిలేషన్ స్టార్ట్ కాగా 2018లో ఎండ్ అయింది.

ఇవి కూడా చదవండి : స్టార్ ప్రొడ్యూసర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన త్రిష.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

Advertisement

Next Story