kavya thapar: వారితో డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
kavya thapar: వారితో డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కావ్య ఈ మాయ పేరేమిటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఊరు పేరు భైరవ కోన చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల రవితేజ ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది. ప్రజెంట్ కావ్య రామ్ పోతినేని కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ఆగస్టు 20 కావ్య థాపర్ పుట్టిన రోజు కావడంతో ఉత్తరాఖండ్‌లో చేసుకుంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందరిలా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మూవీ టీమ్‌తో చేసుకోకుండా ఉత్తరాఖండ్ హరిద్వార్ దగ్గరలో ఉన్న అనంత్ ధామ్ అనాధ ఆశ్రమంలో చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ గురువు ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటుగా అక్కడున్న పిల్లలకు భోజనం ఏర్పాటు చేసింది. ఈ బర్త్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ‘‘నా జన్మదినాన్ని నా ఇంట్లో, నా ఆశ్రమంలో నా ఆత్మ తండ్రి, నా గురువు, నా ఆత్మ కుటుంబంతో జరుపుకోవడం బెస్ట్ అనుభవం.

ధన్యవాదాలు అనంత్‌దామ్ ఈ బర్త్ డే ఎప్పటికీ మర్చిపోలేను. మీ దయ, మీ ఆశీర్వాదం, స్వచ్ఛమైన ఆనందం, ఆనందం, ప్రేమతో నిండిన మార్గంలో నడవడం కంటే ఈ జీవితంలో ఇంకేమీ అడగలేదు. ఈ రోజు కృతజ్ఞత ఆనందంతో నిండిపోయింది. జీవితకాలం పాటు నా హృదయాన్ని నింపిన శుభాకాంక్షలు, ఆశీర్వాదాలతో నన్ను నింపిన నా కుటుంబం, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు. నా ముఖంలో చిరునవ్వు మీ అందరి వల్లనే. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే అది మీ వల్లే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది.

(Video Link Credits to kavyathapar20 Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed