నిహారికకు ఆ పని అంటే అంత ఇష్టమా.. కేవలం దాని కోసమే రెండో పెళ్లా..?

by Kavitha |   ( Updated:2024-07-04 07:58:33.0  )
నిహారికకు ఆ పని అంటే అంత ఇష్టమా.. కేవలం దాని కోసమే రెండో పెళ్లా..?
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో పలు సినిమాలు చేసి అలరించింది. కానీ మెగా ఫ్యామిలీ అంత స్టార్ డమ్ అయితే తెచ్చుకోలేదు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తునే మరోపక్కా సిరీస్‌లో కూడా నటిస్తుంది. అలాగే బిజినెస్ మ్యాన్ అయిన చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. కానీ పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండలేక పలు కారణాల వల్ల విడాకులు తీసుకుంది. అయితే విడాకుల తర్వాత నిహారిక ఇక పెళ్లి చేసుకోదని.. ఒంటరిగానే ఉంటుందని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక వీటికి ఫుల్‌స్టాఫ్ పెట్టేలా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. నాకు పెళ్లిపై నమ్మకం ఉంది. అంతే కాదు నేను మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ల కోసమైనా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. ఒకరితో పెళ్లి జీవితం ఫెయిల్ అయితే మళ్లీ పెళ్లి ఇంట్రెస్ట్ లేదని కాదు. ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందంటే అనేక కారణాలు ఉంటాయని.. కాబట్టి నేను కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడే కాదు అని చెప్పింది నిహారిక. అదేవిధంగా ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం మూవీస్ పైనే ఉంది. కొన్ని రోజుల తర్వాత సెకండ్ మ్యారేజ్ పై డెసిషన్ తీసుకుంటాను. అది లవ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఇంట్లో వాళ్లకు ఇష్టమైతేనే చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఈమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed