Bigg Boss Buzzz : బిగ్‌బాస్ బ‌జ్‌ హోస్ట్ ఎవ‌రో తెలుసా..? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన సీరియల్ హీరో

by Prasanna |   ( Updated:2024-08-29 09:12:35.0  )
Bigg Boss Buzzz : బిగ్‌బాస్ బ‌జ్‌ హోస్ట్ ఎవ‌రో తెలుసా..? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన సీరియల్ హీరో
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ పై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే, కొందరు దీన్ని ఎవరు నమ్మలేదు.. ఇది వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేసారు. కానీ, ఊహించని విధంగా కొన్ని రోజుల క్రితం ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ అందర్ని ఆకట్టుకున్నారు.

సెప్టెంబ‌ర్ 1 నుంచి 8 వ సీజన్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ‌జ్‌కు కూడా ప్రతీ ఏడాది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ షో లో హౌస్‌లో జ‌రిగిన విష‌యాల గురించి షేర్ చేసుకుంటారు. అయితే, మొన్నటి వరకు ఇది ఎవరు హోస్ట్ చేస్తారా అనేక సందేహాలు ఉండేవి. తాజగా దీనిపై క్లారిటీ వ‌చ్చేసింది. దీనికి సంబంధించిన ప్రొమో కూడా రిలీజ్ చేసారు. బిగ్‌బాస్ బ‌జ్ హోస్ట్‌గా అర్జున్ అంబ‌టి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ‘టైమ్ బాగుంటే అన్ని బాగుంటాయి..అప్పుడు ,మనం ఏం చేసినా ఒప్పే అంటారు.. మరి టైమ్ బ్యాడ్ అయితే? బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. లోపల మీరు చేసే ప్రతి దాని గురించి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి.. ఈ సీటు యమ హాటు.’ అంటూ డైలాగ్‌తో ప్రోమో రిలీజ్ చేసారు.

Advertisement

Next Story