- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పని చేశాకనే సమంతకు ‘ఏం మాయ చేశావే’ సినిమాలో ఆఫర్ వచ్చిందా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అండ్ అక్కినేని నాగచైతన్య ‘ఏం మాయ చేసావే’ సినిమాతో పరిచమైన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌తో చిగురించిన ప్రేమ కాస్త పెళ్లి వరకు తీసుకెళ్లింది. టాలీవుడ్ అగ్ర హీరో అయిన నాగార్జున వీరి పెళ్లి టాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఆహ్వానించి.. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. అనంతరం సమంత తల్లిదండ్రుల ఆచారం చెన్నైలో కూడా మరోసారి వివాహం చేసుకుంది. అంత హ్యాపీగా ఉందనుకునే సమయానికి ఏమైందో ఏమో తెలియదు కానీ, డివోర్స్ తీసుకుని ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాకిచ్చారు.
ఇకపోతే సమంత గురించి ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఏం మాయ చేసావే సినిమాలో దర్శక, నిర్మాతలు ఇద్దరు హీరోయిన్లలో ఎవరిని తీసుకోవాలని కన్ఫ్యూజన్లో పడ్డారట. ఇందులో సమంత ఒకరు. ఎలాగైనా ఈ మూవీలో ఆఫర్ కొట్టేయాలని తనలోని డిఫరెంట్ షేడ్స్ ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూపించి మరీ సమంత ఈ సినిమాను ఓకే చేయించుకుందట. ‘‘ఈ సినిమాలో సామ్ నటించకపోయి ఉంటే అసలు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునేది కాదు. అంతేకాదు అసలు అక్కినేని ఇంటికి కోడలు ట్యాగ్ వేయించుకునేది కూడా కాదు. అసలు నాగ చైతన్యకు, సమంతకు అంతగా క్లోజ్‌నెస్ ఉండకపోయేది. ఈ చిత్రం తన కెరియర్ మలుపు తిప్పింది. తన గోతి తనే తవ్వుకుంది.’’ అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడుతున్నారు.