ఎన్టీఆర్ అభిమానులకు షాక్.. ఆ ప్రముఖ థియేటర్‌లో షో రద్దు

by Mahesh |   ( Updated:2024-09-26 13:36:08.0  )
ఎన్టీఆర్ అభిమానులకు షాక్.. ఆ ప్రముఖ థియేటర్‌లో షో రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) హీరోగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర(Devara) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్(NTR) సోలో హీరోగా దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ మొదటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ల విషయంలో మాత్రం ఫ్యాన్స్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు సార్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కాగా.. ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ అయిన కూకట్‌పల్లి(KPHB) భ్రమరాంబ మళ్లికార్జున థియేటర్ (Bhramaramba Mallikarjuna Theatre)లో ఈ రోజు రాత్రి 1 గంటలకు వేయవలసిన ప్రీమియర్ షో (premiere show)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ షోకు సంబంధించిన టికెట్ల విషయంలో గందరగోళం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఎన్టీఆర్ అభిమానులు సహకరించాలని భ్రమరాంబ థియేటర్ ముందు పోస్టర్ ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం జూ. ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా.. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా రేపు(శుక్రవారం సెప్టెంబర్ 27)న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed