- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan kalyan - Samantha: స్టార్ హీరోయిన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వని డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్..? కారణం ఏంటంటే..!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దాదాపు స్టార్ హీరోలందరీ సరసన నటించి స్టార్‌డమ్ అందుకుంది. తన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణించింది ఈ అమ్మడు. అయితే గత కొంత కాలంగా మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఆరోగ్య విషయాలు, తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత తనకు చిన్న సహాయం కావాలని పవన్ కళ్యాణ్‌ను కలవడానికి అపాయింట్మెంట్ కోరిందట. అయితే మొదటి నుంచి ప్రకృతి అంటే ఇష్టం ఉన్న సమంత.. నేటి కాలంలో ప్రతి ఒక్కరు చెట్లను పెంచడం ఎంతో అవసరమని.. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని... చెట్లను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అనుకుంటుందట. అయితే ఈ విషయం పై పవన్ కళ్యాణ్‌ను కలిసి తన ఆలోచన చెప్పి కొంత సాయం కోరుదామని అనుకుంటుందట సమంత.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఢిల్లీ టూర్లు వరుసగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎవ్వరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదట. ఈ క్రమంలోనే సమంత అపాయింట్మెంట్‌ను కూడా రిజెక్ట్ చేశాడట. ఇక ఈ విషయం తెలిసిన సమంత చాలా బాధపడిందట. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితిని అర్థం చేసుకొని అతనికి ఫ్రీ టైం ఉన్నప్పుడే వెళ్లి కలుస్తానని చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా పవన్ కళ్యాణ్, సమంత కలిసి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ టైం నుంచే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడిందని సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ చనువు వల్లనే ఇప్పుడు సాయం కోసం వెళ్లిందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.