నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. బాలకృష్ణ ఏమన్నారంటే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-06 08:37:11.0  )
నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. బాలకృష్ణ ఏమన్నారంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ప్రొగ్రాంలో నర్సులపై చేసిన వ్యాఖ్యలపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. అన్ స్టాపబుల్ ప్రొగ్రాంలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నర్సులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనపై జరుగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి బాలయ్య ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. నా వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. రోగులకు సేవలు అందించే నర్సులంటే తనకు గౌరవం అని తెలిపారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశానన్నారు. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకొంతో గౌరవం అన్నారు. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అన్నారు. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది నర్సులు రాత్రనక, పగలనక నిద్రాహారాలు మానేసి రోగులకు సేవ చేశారన్నారు. నర్సుల మనోభావాలు దెబ్బతింటే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed