ఆ రోడ్డే మందుబాబులకు అడ్డా..

by Aamani |
ఆ రోడ్డే మందుబాబులకు అడ్డా..
X

దిశ,ఉప్పల్: అదొక రెసిడెన్షియల్ ఏరియా,చుట్టూ ఇండ్లు,సీడీఎఫ్ డీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్,పోస్ట్ ఆఫీస్ సంబంధించిన క్వార్టర్స్ ఉన్నాయి. అలాంటి ఏరియాలోనే రోడ్డును ఆనుకొని ఉంది శ్రీ విజయ దుర్గ వైన్ షాప్, దానికి ఎదురుగానే పోస్ట్ ఆఫీస్ ఉండటంతో ఆ దారి గుండా విద్యార్థులు, వర్కింగ్ ఉమెన్స్ వెళుతుంటారు.కానీ కొంత కాలంగా ఆ దారి గుండా నడవాలంటేనే మహిళలు భయపడుతున్నారు.కారణం ఆ వైన్స్ లో మందుకొనే వారిలో అధిక శాతం ఆ రోడ్డుపైనే తాగుతున్నారు.ఆ రోడ్డునే తమ అడ్డాగా మార్చుకున్నారు.

సాయంత్రం 5 అయ్యిందంటే..

పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న శ్రీ విజయ దుర్గ వైన్స్ కు వచ్చే మందుబాబుల వల్ల ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ వైన్ షాప్ చుట్టూ ఇండ్లు ఉన్నాయి.ఈ వైన్ షాప్ ఎదుట ఉన్న రోడ్డుపై నుంచే ఉప్పల్,బోడుప్పల్ కు వెళ్లే వాసులు రాకపోకలు సాగింస్తుంటారు. అయితే సాయంత్రం 5 గంటలు అయితే చాలు తాగుబోతులు ఈ రోడ్డును ఆక్రమిస్తున్నారు.అక్కడ ఆటోలు, బైక్ లు నిలబెట్టి మందు కలిపి, తాగుతున్నారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, పాదచారులు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు భయంతో వణికిపోతున్నారు.

ఏదైనా జరిగితేనే పట్టించుకుంటారా..?

తాగుబోతులు ఈ రోడ్డుపై ఇంత హంగామా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే పట్టించుకుంటారా ? అప్పటి వరకు చూసి చూడకుండా వదిలేస్తారా? అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఎక్సైజ్ పోలీస్ అధికారులు పట్టించుకోకపోతే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు గతంలో ఎక్సెజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని,ఇకనైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed