- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TTD:తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తుల రద్దీ
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్ని సందర్భాలలో సాధారణంగాను, మరికొన్ని సందర్భాల్లో అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరుస సెలవులు(Holidays), సంవత్సరాంతం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తులు నిన్న(గురువారం) సాయంత్రానికి రింగు రోడ్డులోని శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ ప్రకటించింది.
రద్దీ నేపథ్యంలో భక్తులు(Devotees) శుక్రవారం ఉదయం సర్వదర్శనం క్యూ లైన్‌లోకి ప్రవేశించాలని మైక్ సెట్లలో విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో భక్తులకు పాలు, నీరు, అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు. ఈ మేరకు గురువారం స్వామి వారిని 59,564 మంది భక్తులు దర్శించుకోగా.. 24,905 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.4.18 కోట్లు ఆదాయం వచ్చింది. భక్తులు తిరుమల(Tirumala)లో రద్దీని గమనించి దర్శనానికి వస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.