సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని గాంధీ విగ్రహానికి వినతి

by Aamani |
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని గాంధీ విగ్రహానికి వినతి
X

దిశ,భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అప్పులు తెచ్చామని, బిల్లులు రాక వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సర్పంచులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మన్నె పద్మా రెడ్డి ,గోడల ప్రభాకర్, యాఖరి రేణుక నరసింగ రావు, మట్ట బాలమణి సుదర్శన్, రమావత్ రాముల నాయక్, నోముల ఎల్లారెడ్డి, వస్పరి పారిజాత మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story