మరియమ్మ హత్య కేసులో సంచలన పరిణామం.. ఒకేసారి 34 మంది అరెస్ట్

by srinivas |   ( Updated:2024-12-27 15:50:19.0  )
మరియమ్మ హత్య కేసులో సంచలన పరిణామం.. ఒకేసారి 34 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మరియమ్మ హత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఒకేసారి 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెలగపూడి(Velagapudi)కి చెందిన మరియమ్మ2020 డిసెంబర్ 27న హత్యకు గురయ్యారు. అయితే హత్యకు ముందు అప్పటి సీఎం వైఎస్ జగన్(Ys Jagan), ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు. దీంతో ఆమెపై స్థానిక వైసీపీ(Ycp) కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరియమ్మ చివరకు మృతి చెందారు.

పోలీసులు కేసు నమోదు చేసినా చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులో దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌(Former Mp Nandigam Suresh)పై అభియోగాలున్నాయి. దీంతో ఆయన బెయిల్ మంజూరుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు(Supreme Court)కు సైతం వెళ్లారు. అయితే అక్కడ సురేశ్‌కు నిరాశ ఎదురైంది. చార్జిషీట్ దాఖలయ్యే వరకూ జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివిధ కేసుల్లో ఇప్పటికే నందిగం సురేశ్ జైలు ఉన్నారు. తాజాగా మరియమ్మ హత్య కేసులో పోలీసులు 34 మందిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు.


Read More..

TTD:తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తుల రద్దీ

Advertisement

Next Story

Most Viewed