Tragedy: రాష్ట్రంలో మరో ఘోరం.. ఉరేసుకుని మూకుమ్మడిగా కుటుంబం ఆత్మహత్య

by Shiva |
Tragedy: రాష్ట్రంలో మరో ఘోరం.. ఉరేసుకుని మూకుమ్మడిగా కుటుంబం ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఉరేసుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా (YSR Kadapa District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింహాద్రిపురం (Simhadripuram) మండల పరిధిలోని దిద్దెకుంట (Diddekunta) గ్రామానికి చెందిన నాగేంద్ర (Nagendra), వాణి (Vaani) భార్యభర్తలు. ఉన్న భూమిలో వాళ్లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఇటీవలే నాగేంద్ర అప్పు చేసి మరీ చీనీ తోటను సాగు చేశాడు.

ఆశించిన విధంగా ఆదాయం రాకపోవడం, రుణదాతల ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో భార్య వాణి (38), కూతురు గాయత్రి (12), కుమారుడు భార్గవ్ (11)‌ను తోటకు తీసుకెళ్లి ఉరేశాడు. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీనులు మృతదేహాలను పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed