సైకిల్ పై వెళ్తున్న బాలుడిని ఢీకొన్న లారీ...అక్కడికక్కడే మృతి

by Sridhar Babu |
సైకిల్ పై వెళ్తున్న బాలుడిని ఢీకొన్న లారీ...అక్కడికక్కడే మృతి
X

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. సైకిల్ పై వెళ్తున్న బాలుడిని లారీ ఢీకొట్టగా స్వాత్రిక్ (12) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోతుండగా గ్రామస్తులు వెంబడించి వట్టెంల గ్రామంలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బాలుడు సెలవు కావడంతో శాత్రాజుపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్దకు రాగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed