- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
దిశ, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన పొన్నం మహేందర్ (25) అనే యువకుడు గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేందర్ ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి జాగిరిపల్లి గ్రామం నుంచి హనుమకొండ వెళ్తుండగా రామచంద్రాపురం గ్రామ బస్టాండ్ సమీపంలో ప్రమాదవశాత్తు తాను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. అర్ధరాత్రి దాటడంతో మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు ప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సైదాపూర్ ఎస్సై తిరుపతి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరగడానికి గల కారణాలను స్థానికులతో తెలుసుకున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.