‘బాగా మద్యం తాగి అతడు నా మ్యూజిక్ స్కిల్స్‌ను ప్రశ్నించాడు’.. AR Rahman ఎమోషనల్ కామెంట్స్

by Anjali |
‘బాగా మద్యం తాగి అతడు నా మ్యూజిక్ స్కిల్స్‌ను ప్రశ్నించాడు’.. AR Rahman ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఏఆర్ రెహమాన్(Music director AR Rahman) ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. మొన్నటివరకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ విడాకుల వార్తలు నెట్టింట గుప్పుమన్నాయి. ఇకపోతే తాజాగా ఏఆర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. తన కెరీర్‌లో ఎదుర్కొన్న పలు సంఘటనలు గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు. 1985-1986 మధ్యలో జరిగిన ఓ ఇన్సిడెంట్ తనను ఎంతో ఛేంజ్ చేసిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో నా స్టైల్ మార్చుకునేలా చేసిందని అన్నారు. చాలా రోజుల కింద ఓ గిటారిస్ట్(Guitarist) ఫుల్‌గా తాగొచ్చి.. నా సంగీతం స్కిల్స్ గురించి క్వశ్చన్ చేశాడని వెల్లడించారు.

నువ్వు సినిమాకు సంగీతాన్ని అందించగలవా? నువ్వు ఏం ప్లే చేస్తావయ్యా? అంటూ నన్ను చాలా చీప్‌గా చూస్తూ చులకనగా మాట్లాడడని ఎమోషనల్ అయ్యారు. కానీ అతడి మాటలు నేను అర్థం చేసుకునేందుకు వన్ వీక్ పట్టిందని తెలిపారు. అప్పుడు ఎంతో బాధ అనిపించిందని పేర్కొన్నారు. నేను పని చేసే కంపోసర్ల ప్రభావం తనపై ఉంటుందని అప్పుడు క్లారిటీ వచ్చిందని.. దీంతో తన స్టైల్ ఎలా మార్చుకుంటే బాగుంటుందని ఫోకస్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ అతడి మాటలు మర్చిపోవడానికి, బాధలోనుంచి బయటకు వచ్చేందుకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టిందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed