ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకమైంది : మక్తల్ ఎమ్మెల్యే

by Aamani |
ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకమైంది : మక్తల్ ఎమ్మెల్యే
X

దిశ, మక్తల్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వినమ్రతతో ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఆధార్ కార్డు సృష్టించిన వ్యక్తి.ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో, జీడీపీ వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు, యూపీఏ ప్రభుత్వంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆర్టీఐ, ఉపాధి హామీ పథకం వంటి పథకాలను ప్రవేశపెట్టడం లో ఆయన పాత్ర చాలా కీలకమైంది. తెలంగాణ ఉద్యమ నేతలతో కలిసి ఢిల్లీ లో వారిని కలవడం మరువలేనిది, సకల జనుల సమ్మె, విద్యార్థుల అసహజ మరణాల గురించి వివరంగా అడిగి తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ తో చర్చించి ప్రక్రియ లో పూర్తి సహకారం అందించిన వారి సేవలను జాతి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed