Funky: అతనికి బర్త్‌డే విషెస్ తెలిపిన ‘ఫంకీ’ టీమ్.. నెట్టింట ఆకట్టుకుంటున్న పోస్టర్

by Kavitha |   ( Updated:2024-12-27 16:09:40.0  )
Funky: అతనికి బర్త్‌డే విషెస్ తెలిపిన ‘ఫంకీ’ టీమ్.. నెట్టింట ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’(Funky). కేవీ అనుదీప్‌(KV Anudeep) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) తెరకెక్కిస్తున్నారు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియా వేదికగా మూవీ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. డైరెక్టర్ అనుదీప్‌ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘టాలెంటెడ్ అండ్ క్రేజీ డైరెక్టర్ అయిన కేవీ అనుదీప్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మరొక లాఫ్ ప్యాక్డ్ రోలర్ కోసం మీకు మీరే పోటీ పడండి’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జత చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. అనుదీప్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

Read More ...

Harihara Veeramallu: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫస్ట్ సింగిల్ పై సూపర్ అప్‌డేట్..! (పోస్ట్)


Next Story

Most Viewed