- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేక్షకుడికి ఆనందమేకాదు ఆలోచన కూడా రప్పించాలి: రామ్ రెడ్డి
దిశ, సినిమా: సినిమా అంటే కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వాలంటున్నాడు దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల. తను తెరకెక్కించిన ‘నేడే విడుదల’ మార్చి 10న విడుదలవగా ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కాగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న రామ్.. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘జగిత్యాల జిల్లా లక్ష్మిపూర్‌కు చెందిన ఓ రైతు బిడ్డను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ‘నేడే విడుదల’ టైటిల్‌తోనే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో మంచి మెసేజ్ ఉంది. సినిమాకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆనందింపజేయడం ముఖ్యమనుకుంటా. అభిమానులు ఆనందపడేలా, ఆలోచింపజేసే చిత్రాలే చేయాలనుకుంటున్నా. డైరెక్టర్ సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే సుకుమార్‌కు నేను ఏకలవ్య శిష్యుడిని’ అంటూ వివరించాడు.