కాస్టింగ్ కౌచ్ దుమారం.. ఉన్నతస్థాయి కమిటీ వేసిన ప్రభుత్వం

by M.Rajitha |
కాస్టింగ్ కౌచ్ దుమారం.. ఉన్నతస్థాయి కమిటీ వేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళీ చిత్ర పరిశ్రమ కాస్టింగ్ కౌచ్ దుమారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏడుగురు పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక హింస మీద జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనాలకు దారి తీసింది. ఈ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమ మీద జరిగిన లైంగిక ఆరోపణలను బయట పెట్టడంతో పలువురు ప్రముఖ నటులు, కీలక బాధ్యతల్లో ఉన్నవారు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కేరళలో ఈ ఇష్యూ మీద తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది.

కాగా నటి రేవతి సంపత్.. మలయాళీ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సిద్ధిఖీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడు అని ఆరోపించింది. మరో బెంగాలీ నటి శ్రీలేఖ.. దర్శకుడు, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలక్రిష్ణన్ తనతో మిస్ బిహేవ్ చేశాడంటూ ఆరోపించింది. వీరు ఇరువురు వారి పదవులకు రాజీనామా చేశారు. అయినప్పటికీ విమర్శలు ఆగకగపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐజీ స్పర్జన్ ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

Next Story

Most Viewed