- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video : ఇదెక్కడి పిచ్చి.. పాడుపడ్డ బావిపై పిల్లాడితో! ఎండీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పిచ్చి పీక్స్‌కు చేరింది. లైకులు, ఫాలోవర్స్ పెంచుకోని పాపులర్ అవ్వడం కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ తీస్తున్నారు.. మరికొందరు ఇతరుల ప్రాణాలను ఇరుకున పెడుతున్నారు.
తాజాగా ఓ తల్లి రీల్స్ మోజులో పడి తన కన్న బిడ్డతో ప్రమాదకంగా స్టంట్స్ చేస్తుంది. పాడుబడ్డ చిన్న బావిపై ప్రమాదకరంగా కూర్చోని చిన్న పిల్లవాడితో రీల్స్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రీల్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎక్స్ వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీడియో పోస్ట్ చేశారు.
‘ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి’ అంటూ సజ్జనార్ వీడియో షేర్ చేశారు.