- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పులు జరుగుతుంటే చేతులు కట్టుకొని కూర్చోలేం: డిప్యూటీ సీఎం పవన్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వాడారని అధారాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రాయశ్చిత్త దీక్షను ఆదివారం స్వీకరించారు. శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగినందుకు గాను క్షమించాలని శ్రీవారిని కోరుతూ.. దీక్షను కొనసాగించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ (Tirumal Laddu)ను దేశంలోని ప్రతి భక్తుడు మహా ప్రసాదంగా భావిస్తారని పేర్కొన్నారు.
ఈ వివాదంలో తమకు ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సంస్కరణల పేరుతో టీటీడీ (TTD) పరిధిలో అనేక మార్పులను చేసిందని గుర్తు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) పాలనలో 219 ఆలయాలను సైతం అపవిత్రం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ పాలక మండలిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ లబ్ధి ఉందంటూ వైసీపీ (YCP) ఆరోపిస్తోందని.. తప్పులు జరుగుతుంటే చేతులు కట్టుకొని కూర్చోలేం కదా అని పవన్ కౌంటర్ ఇచ్చారు.