Dry fruits: డ్రైఫ్రూట్స్ స్టోర్ చేసే విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..!!

by Anjali |
Dry fruits: డ్రైఫ్రూట్స్ స్టోర్ చేసే విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..!!
X

దిశ, వెబ్‌డెస్క్: పలు రకాల డ్రై ఫ్రూట్స్(Dry fruits) తినడం వల్ల మీ శరీరానికి కావాల్సిన విటమిన్లు(Vitamins) ప్రొటీన్లు(proteins), మినరల్స్(Minerals), మొదలైన వివిధ పోషకాలు అందుతాయి. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాన్సర్ నివారణ(Cancer prevention), టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ(Control of type 2 diabetes), వెయిట్ లాస్(Weight loss), బరువు పెరగడం(Weight gain), బోన్స్ ను స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు చేస్తాయి. ఇమ్మూనిటి పవర్(Immunity power) ను పెంచుతాయి. బాదం పప్పు(Almonds), వాల్ నట్స్(Wall nuts), పల్లీలు(Pallīlu), జీడిపప్పు(cashew nut), ఎండు ద్రాక్ష(Raisins) వంటి డ్రైఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

అలాగే యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants), ఖనిజాలు(Minerals) అధికంగా ఉంటాయి. ఇవి గుండె(heart) ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే షాప్స్‌లోకెళ్లినప్పుడు ధర తక్కువ ఉన్నట్లైతే.. చాలా మంది ఒకేసారి ఎక్కువ డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేస్తుంటారు. దీంతో అప్పుడప్పుడు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. రంధ్రాలు ఏర్పడటం, పురుగులు పట్టడం లాంటివి జరుగుతాయి. డ్రై ఫ్రూట్స్ పాడవ్వడానికి కారణాలు.. ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

డ్రై ఫ్రూట్స్ పాడవ్వడానికి కారణాలు..

డ్రైఫ్రూట్స్ పాడవ్వడానికి మెయిన్ రీజన్ సరిగ్గా స్టోర్ చేయరాకపోవడం. గాలి, వెలుతురు చేరి తొందరగా పాడైపోతాయి. వెలుతురు, గాలి తగలడం కారణంగా అవి ఆక్సీకరణ(Oxidation) చెందుతాయి. బొక్కలు పడుతాయి. టేస్ట్ పోతుంది. పిండి పిండిగా మారుతాయి. కాగా గాలి చొరబడని కంటైనర్లు, డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టాలి. ఒకవేళ ఫ్రిడ్జ్‌(fridge)లో పెట్టాలనుకుంటే ప్రాస్టిక్ బాక్స్(Plastic box) లోపెట్టి మూత సరిగ్గా పెట్టి స్టోర్ చేయొచ్చు. సరిగ్గా నిల్వ చేస్తే మాత్రం ఏడాది పాటు నిల్వ ఉంటాయి.

మసాలాలకు దూరంగా ఉంచాలి..

అలాగే డ్రైఫ్రూట్స్ కు మసాల(spices), తేమ, ఘాటైన స్మెల్ వచ్చేవి దూరంగా ఉంచాలి. అలాగే వీటిని చాలా మంది ప్యాకెట్లలో ఉంచుతారు. కానీ తిన్నాక వాటికి క్లిప్స్ పెట్టాలి. దీంతో పాడవ్వకుండా ఉంటాయి. డైరెక్ట్ ఎండ తగిలే ప్లేస్‌లల్లో మాత్రం అస్సలు ఉంచకూడదు. సూర్యరశ్మి (sunshine) తక్కువగా ఉన్న కాస్త చీకటిగా ఉన్న దగ్గర పెడితే బెటర్. పిస్తా(Pista),నట్స్(Nuts) లాంటివి అయితే షెల్స్ లో పెట్టాలి. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేసేవారు ఎక్స్‌పైరీ డేట్(Expiry Date) గమనించాలి.

Advertisement

Next Story