8 హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌ల నియామకం.. సుప్రీంకోర్టు కొలీజియం నోటిఫికేషన్

by karthikeya |   ( Updated:2024-09-22 06:03:00.0  )
8 హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌ల నియామకం.. సుప్రీంకోర్టు కొలీజియం నోటిఫికేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని 8 హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌ (Chief Justice)లను నియమించడానికి సంబంధించిన నోటిఫికేషన్ (Notification) జారీ అయింది. సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court) ఈ నోటిఫికేషన్‌ను ప్రత్యేకంగా జారీ చేసింది. శనివారం విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ (Delhi), జార్ఖండ్ (Jharkhand), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir), లడఖ్ (Laddakh), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), కేరళ (Kerala), మేఘాలయ (Meghalaya), మద్రాస్ (Madras) హైకోర్టుల కోసం ప్రధాన న్యాయమూర్తుల పేర్లను ఈ కొలీజియం సిఫార్సు చేసింది.

ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ (Arjun Ram Meghaval) ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. భారత రాజ్యాంగం (Indian Constitution) అందించిన అధికారాలను ఉపయోగించి, రాష్ట్రపతి (President) కింది హైకోర్టు (High Court)ల ప్రధాన న్యాయమూర్తులను నియమించడం, బదిలీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే కొత్తగా నియామకాలైన వారి పేర్లను కూడా వెల్లడించారు.

కొత్తగా నియామకమైన న్యాయమూర్తులు వీళ్లే:

  1. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మన్మోహన్‌కు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి
  2. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజీవ్ శాఖ్దర్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ
  3. బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ నితిన్ మధుకర్‌కు జమ్దార్‌ను కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ
  4. బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ కేఆర్ శ్రీరాంకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ
  5. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీకి మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ
  6. జమ్మూకశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు జడ్జి జస్టిస్ తశీ రబ్‌స్తాన్‌‌కు అదే కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి
  7. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ
  8. ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్ గుర్మీత్ సింగ్ సంధావలియాకు జమ్మూ కశ్మీర్ అండ్ లడాఖ్ జడ్జిగా పదోన్నతి, బదిలీ
Advertisement

Next Story