- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'న్యాస్ పరాక్ సర్వేను విజయవంతం చేయాలి'
దిశ, చిట్యాల : దేశవ్యాప్తంగా డిసెంబరు 4న జరిగే, న్యాస్ పరాక్ (పరక్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 ) సర్వేను విజయవంతం చేయాలని న్యాస్ జిల్లా లెవెల్ కో ఆర్డినేటర్ ఎస్.రమేష్, జిల్లా అకడమిక్ కో-ఆర్డినేటర్ కె. లక్షణ్ కోరారు. చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గోరికొత్తపల్లి, టేకుమట్ల మండలాలకు చెందిన ,సూపర్ వైజర్లు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా మండలాల్లో ఎంపికైన పాఠశాలల్లో, సర్వే విజయవంతం చేయడంలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల పాత్ర కీలకమన్నారు.
సర్వే సందర్భంగా, విద్యార్థులు వందశాతం పాఠశాలలకు హాజరయ్యేలా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఓఎంఆర్ షీట్లలో జాగ్రత్తగా బబ్లింగ్ చేయించాలని సూచించారు. ఎంఈవో కోడెపాక రఘుపతి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 3, 6, 9 తరగతుల విద్యార్థుల విద్యా సామర్థ్యలను తెలుసుకునేందుకు, న్యాస్ పరాక్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్పీ రతన్ సింగ్ , ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి తదితరులు పాల్గొన్నారు.