Public Governancve Celebrations : ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ విడుదల

by M.Rajitha |   ( Updated:2024-11-28 16:25:39.0  )
Public Governancve Celebrations : ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదికాలం పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు(Public Governancve Celebrations) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పాలనా కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే ఈ ఉత్సవాల ప్రధానోద్దేశం. డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ ఖరారు చేసింది ప్రభుత్వం. డిసెంబర్ 1న 26 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల(Intigrated Schools)కు శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. డిసెంబర్ 2న రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. అలాగే డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్(CM Cup) స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఇక ముగింపు ఉత్సవాలను మరింత గ్రాండ్ గా జరిపేందుకు సర్కార్ సన్నద్ధం అవుతోంది. డిసెంబర్7వ తేదీన ట్యాంక్ బండ్ మీద, 8న సచివాలయంలో, 9న నెక్లెస్ రోడ్ వేదికగా, ముగింపు సభలు జరపనున్నారు. చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయా కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు అంతా హాజరు కానుండగా.. ముఖ్య అతిధులుగా ఏఐసీసీ పెద్దలు, రాహుల్ గాంధీ(Rahul Gandhi) హాజరు కానున్నారని సమాచారం.

షెడ్యూల్ ఇదే..

డిసెంబర్ 1,

* ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు.

* విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు.

* సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)

డిసెంబర్ 2,

* 16 నర్సింగ్ మరియు 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం.

* 213 కొత్త అంబులెన్సులు ప్రారంభం.

* 33 ట్రాన్స్ జెండర్ క్లినిక్‌ల ప్రారంభం.

* ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పై పైలట్ ప్రాజెక్టు.

డిసెంబర్ 3,

* హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు.

* ఆరంగర్ నుండి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం.

* రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభం.

* కెబిఆర్ పార్క్ సమీపంలో 6 జంక్షన్ల అభివృద్ధి పనుల ప్రారంభం

డిసెంబర్ 4

* తెలంగాణ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన.

* వర్చువల్ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం.

* 9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.

డిసెంబర్ 5,

* ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం.

* స్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు

* 3 (మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ లో) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం.

* ఘట్​ కేసర్​ లో బాలికల ఐటిఐ కాలేజీ ప్రారంభం.

డిసెంబర్ 6,

* యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుదుత్పత్తి ప్రారంభం.

* 244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన.

డిసెంబర్ 7,

* స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం.

* పోలీస్ బ్యాండ్ ప్రదర్శన.

* తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

డిసెంబర్ 8,

* 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాజెక్టుల ప్రారంభం.

* 130 కొత్త మీ సేవల ప్రారంభం.

* ఎఐ సిటీ కి భూమి పూజ

* స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన.

* తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలు.

డిసెంబర్ 9,

* లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్ష్యంలో

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.

* ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు

* డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు

Advertisement

Next Story