ISKCON : ఇస్కాన్ నిషేధానికి బంగ్లాదేశ్ కోర్ట్ నిరాకరణ

by M.Rajitha |
ISKCON : ఇస్కాన్ నిషేధానికి బంగ్లాదేశ్ కోర్ట్ నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఇస్కాన్(Iskcon) ను నిషేధానికి బంగ్లాదేశ్(Bangladesh) కోర్ట్ నో చెప్పింది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించాలని బంగ్లా రాజధాని ఢాకా హైకోర్టు(Dhakha High Court)లో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్ట్.. పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. కాని ఇస్కాన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని బంగ్లా ప్రభుత్వానికి కోర్ట్ నోటీసులు జారీ చేసింది. కాగా దేశంలో ఇస్కాన్ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా దానిపై నిషేధం విధించాలని 10 మందితో కూడిన సుప్రీంకోర్ట్ జడ్జీల బృందం ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపింది. అలాగే ఇటీవల మతఘర్షణల్లో బంగ్లా జెండాను అగౌరవ పరిచాడని చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అనే ఇస్కాన్ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేయగా.. హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. జరుగుతున్న ఘటనల దృష్ట్యా ఇస్కాన్ ను దేశం నుంచి నిషేధించాలని ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Advertisement

Next Story

Most Viewed