Spy Cameras: బెంగళూరులో సంచలనం.. లేడీస్ వాష్‌రూంలలో స్పై కెమెరాలు

by Shiva |   ( Updated:2024-09-22 05:42:30.0  )
Spy Cameras: బెంగళూరులో సంచలనం.. లేడీస్ వాష్‌రూంలలో స్పై కెమెరాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లవల్లేరు (Gudlavalleru) గర్ల్స్ హాస్టల్‌ వాష్‌రూంలలో రహస్య కెమెరాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై విద్యార్థి సంఘాలతో పాటు పలు మహిళా సంఘాలు ఆందోళనలతో రొడ్కెక్కాయి. అయితే, ఆ ఘటన మరుకముందే బెంగళూరు (Bengaluru)లో అలాంటి వ్యవహారమే మరొకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు (Bengaluru) సమీపంలోని కుంబల్‌గోడు (Kumbalgodu) ఏసీఎస్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల(ACS College of Engineering College)లో ఓ విద్యార్థి బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు గుట్టుచప్పుడు కాకుండా గర్ల్స్ వాష్ రూంలలో స్పై కెమెరాల (Spy cameras)ను అమర్చాడు. అనంతరం పలువురు విద్యార్థినుల వీడియోలను తన మొబైల్‌ ఫోన్‌లోొ స్టోర్ చేసుకున్నాడు.

అయితే, విషయం దావానంలా కాలేజీ మొత్తం వ్యాపించడంతో విద్యార్థినులు ఆగ్రహంతో కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. వాష్‌రూంలలో స్పై కెమెరా (Spy cameras)లు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బెంగళూరు పోలీసులు (Bengaluru Police) రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక నిందితుడిగా పేర్కొన్న ఫైనలియర్ విద్యార్థిని వారు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. విద్యార్థినులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, నిందితుడు మొబైల్ ఫోన్‌లో దాదాపు 7, 8 వీడియోలను స్టోర్ చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Advertisement

Next Story

Most Viewed