Tirumala Darshan Timings: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి పట్టే సమయం ఎంతంటే.?

by Geesa Chandu |
Tirumala Darshan Timings: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి పట్టే సమయం ఎంతంటే.?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(TTD)లో.. భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. నేడు ఆదివారం సెలవు దినం అయినా కూడా భక్తుల రద్దీ ఎక్కువగా లేకపోవడంతో స్వామి వారి దర్శనం తొందరగానే అవుతోంది. తక్కువ సమయంలోనే తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు భక్తులు.అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం భక్తుల రద్దీ చాలా తక్కువ సంఖ్యలో ఉండటం ఇదే మొదటిసారి అని ఆలయ అధికారులు తెలిపారు.

ఆదివారం తిరుమలలో.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న 25 కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలాగే సర్వ దర్శనం కోసం ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా క్యూ లైన్ లోకి ప్రవేశించిన భక్తులకు, శ్రీవారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది.నిన్న(శనివారం) శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. అయితే ఈ రోజు టైమ్ స్లాట్ దర్శన భక్తులకు 3 గంటల్లోనే స్వామి వారి దర్శనం పూర్తవుతుంది. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్న భక్తులకు 2-3 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. ఇక, శనివారం శ్రీవారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు.వీరిలో 31,151 మంది భక్తులు తమ తలనీలాలను స్వామి వారికి సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. అలాగే స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు అని ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed