- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ambati : పవన్ వ్యాఖ్యలపై అంబటి వైరల్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్ : హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదని గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)చేసిన వ్యా్ఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)ఎక్స్ వేదికగా వేసిన కౌంటర్(Counter) వైరల్ గా మారింది. తోటి హీరోని అన్యాయంగా అరెస్టు చేస్తే 27 రోజులుగా నోరు విప్పకపోవడం మీ స్వభావం అని పవన్ వ్యాఖ్యలకు అంబటి తన ట్వీట్ లో కౌంటర్ వేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ నేరుగా స్పందించకపోవడాన్ని పరోక్షంగా అంబటి గుర్తు చేస్తూ పవన్ విమర్శలను తిప్పికొట్టారు.
కాగా గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో పవన్ తన ప్రసంగంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో సినిమా టికెట్ల కోసం మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోలు వెళ్లి దండాలు పెట్టి అడగాల్సి వచ్చిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని.. హీరోలు వెళ్లి సీఎంలకు ఎందుకు దండాలు పెట్టాలని, కావాలంటే నిర్మాతలు వెళ్లి మాట్లాడండని. హీరోలు వచ్చి నమస్కారం పెట్టాలి అనుకునేంత లోలెవెల్ వ్యక్తులం మేము కాదని, సినిమా పరిశ్రమకు సహకారం అందించడం స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుండి నేర్చుకున్నామని వ్యాఖ్యానించారు.