Breaking: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్వయంగా సంతకం చేసిన అల్లు అర్జున్

by srinivas |   ( Updated:2025-01-05 05:56:53.0  )
Breaking: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్వయంగా సంతకం చేసిన అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌(Hyderbad Chikkadapalli Police Station)కు హీరో అల్లు అర్జున్(Hero Allu Arjun) వెళ్లారు. ‘పుష్పా-2’సినిమా(Pushpa-2 Movie) రిలీజ్ సందర్భంగా సంథ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దీంతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు కారులో బయల్దేరి వెళ్లారు. స్టేషన్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన తర్వాత తిరిగి ఇంటికి బయల్దేరి వెళ్లారు.

ఇక ఇదే కేసులో అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన రెగ్యూలర్ బెయిల్ మంజూరు అయింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన ప్రతక్ష్యంగా హాజరయ్యారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed