- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'అలాంటి సీన్స్ వల్ల చాలా ఆఫర్స్ కోల్పోయాను'.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అయితే చివరగా నటించిన చిత్రాలు అంతగా మెప్పించలేక పోయాయి. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను నా కెరీర్ తొలి నాళ్లల్లో ముద్దు సీన్స్‌లో నటించడం చూసి మా పేరెంట్స్ షాక్ అయ్యారు. దీంతో వారు నాపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఇక కిస్ సీన్స్ ఉన్న సినిమాల్లో నటించకూడదని స్ట్రిక్ట్ కండిషన్ కూడా పెట్టారు. అయితే నాకు చాలా సినిమాలు లిప్ లాక్ సీన్స్ ఉన్నవే ఆఫర్లు వచ్చాయి. బట్ ఈ కండిషన్ వల్ల నేను వాటిలో నటించలేక పోయాను. అలా నేను లిప్ లాక్ సీన్స్ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను’ అని మృణాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.