‘విలీన గ్రామమైన కోటార్‌ముర్ లో సమస్యలు పరిష్కరించండి..’

by Aamani |   ( Updated:2025-01-05 04:47:27.0  )
‘విలీన గ్రామమైన కోటార్‌ముర్ లో సమస్యలు పరిష్కరించండి..’
X

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ లో ఏడేళ్ల క్రితం కలిసిన వీలీన గ్రామమైన కోటార్మూరులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించండి సార్లు అంటూ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శనివారం వేరువేరుగా ఆర్మూర్ ఇరిగేషన్ డీఈ కృష్ణమూర్తి, ఆర్మూర్ తాసీల్దార్ గజనాన్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజులకు వినతి పత్రాలను అందజేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ నుండి గోవింద్ పెట్ గ్రామానికి ఉన్న లింకప్ రోడ్డు పూర్తిగా కబ్జాకు గురైందని, రెవెన్యూ మ్యాప్ లో ఎలా ఉంటే అలా కొలతలు తీయించి కబ్జాకు గురైన రెండు గ్రామాల మధ్య లింకప్ రోడ్డును మరల ఏర్పాటు చేయించి ప్రజల రాకపోకలకు సహకరించాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు.

అదే విధంగా గ్రామంలోని పెద్ద చెరువు, చిన్న చెరువు రెండు కూడా మురిగినీటితో కంపు కొడుతున్నాయని, అందులో పెరిగే చేపలు చెడిపోతున్నాయని మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పశువులు నీరు తాగేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెడిపోయిన నీరును తొలగించి మరలా నిజం సాగర్ నీటితో పరిశుభ్రంగా చెరువులను మత్స్యకారుల ఉపాధికి సిద్ధం చేయాలని కోరారు. దీంతోపాటు విలీన గ్రామమైన మా కోటార్ ముర్ పరిధిలో జాతీయ రహదారి ప్రక్కన డంపింగ్ యార్డ్ ను నిర్మించి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు చెందిన చెత్తను తెచ్చి వేస్తూ చెత్త గ్రామంగా చేస్తున్నారని, డంపింగ్ యార్డ్ కింద గల చెక్ డ్యామ్ లోని నీరు పూర్తిగా డంపింగ్ యార్డ్ వ్యర్థ పదార్థాల కలయికతో విషతుల్యం అయిందని, అందులో పెరిగిన చేపలు ఆ చెక్ డాం నుంచి తీసిన అరగంట లోపే మృత్యువాత పడుతూ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అధికారులకు మొరపెట్టుకున్నారు.

కోటారుమూరు నుండి డంపింగ్ యార్డ్ ను తొలగించాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ కు కోరారు.ఈ మూడు ప్రధాన సమస్యలను విలీన గ్రామమైన కోటార్ మోర్ గ్రామ ప్రజల సౌకర్యార్థం పరిష్కరించాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు విన్నవించుకున్నారు. అధికారులను కలిసిన వారిలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డిష్ బెనికి గంగాధర్, క్యాషియర్ మామిడి ఏలియా రెడ్డి, కార్యదర్శి నాగుల శ్రీధర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.


Advertisement

Next Story

Most Viewed