Unknown Facts: పక్షులు ‘V’ ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో తెలుసా?

by Prasanna |   ( Updated:2024-09-22 15:00:40.0  )
Unknown Facts: పక్షులు ‘V’ ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలు చాలానే ఉంటాయి. తెలిసింది కొంచమే.. తెలియాల్సింది చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమించించారా.. ఆకాశంలో పక్షులు గుంపుగా వెళ్తుంటాయి. అయితే, ఇవి ఎప్పుడెళ్ళినా V ఆకారంలోనే వెళ్తాయి. మరి, పక్షులు గుంపుగా ఎందుకెళ్తాయో అనేది ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రవేత్తలు దీనిపై ఎన్నో పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పక్షులు ఎగురుతున్నప్పుడు V ఆకారంలో వెళ్ళడానికి గల కారణాలను పరిశోధకలు తెలిపారు. ఈ ఆకారంలో పక్షులు సులభంగా ఎగరగలవని, అలాగే ఆ సమయంలో వేరే పక్షులను ఢీకొట్టవని తెలిపారు. ఈ V ఆకారంలో పయనిస్తున్నప్పుడు పక్షులన్నింటికీ మార్గం చూపేందుకు ఒక నాయకుడు ఉంటాడు.. ఆ పక్షే ముందుంటుంది. ఈ ఎగిరే సమయంలో వాటి వెనుకున్న గాలి కంప్రెస్ అవుతుంది దీని వలన గాలి పైకి వెళ్లి వాటి ప్రెజర్ ను తగ్గిస్తుంది. అప్పుడు వెనుకాల ఉండే మిగతా పక్షులు కూడా సులభంగా ఎగురగలుతాయి. అంతేకాకుండా ఇవి వాటి స్థానాలను మార్చుకుని ఎగురుతాయి.. ఇలా చేయడం వలన దేని మీద ఎక్కువ ప్రెజర్ పడదని తెలిపారు. ఒత్తిడి లేకుండా సులభంగా ఆకాశంలో ఎగరడానికి ఈ V ఆకారంలో పయనిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read More...

కుక్కలు ఎందుకు ప్రైవేట్ పార్ట్స్ వాసన చూస్తాయో తెలుసా..?

Advertisement

Next Story

Most Viewed