Free Gold : బంగారం ఫ్రీగా కావాలా..? ఈ నాలుగు ప్రదేశాలకు వెళ్లాలి.. కాకపోతే..!

by Javid Pasha |
Free Gold : బంగారం ఫ్రీగా కావాలా..? ఈ నాలుగు ప్రదేశాలకు వెళ్లాలి.. కాకపోతే..!
X

దిశ, ఫీచర్స్ : బంగారం అంటే ఇష్టపడనివారు ఉండరు. రకరకాల ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. డబ్బుతో సమానమైన విలువ ఉంటుంది కాబట్టి ఏ సమయంలోనైనా తమను ఆదుకుంటుందని అందరూ భావిస్తారు. అందుకే ఏ మాత్రం అవకాశం దొరికినా, ఆర్థిక పరిస్థతి మెరుగు పడినా ఎంతో కొంత పసిడి కొనాలని భావించేవారు చాలా మందే ఉంటారు. ఇంకొందరు గోల్డ్ కలిగి ఉండటం సమాజంలో తమ స్టేటస్‌ సింబల్‌గా భావిస్తారు. ప్రజల్లో ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టే బంగారం ధర రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ధరలు తగ్గాయన్న వార్తలు క్యూరియాసిటీని పెంచుతుంటాయి. అలాంటిది ఎక్కడైనా ఫ్రీగా లభిస్తుంది అని తెలిస్తే.. ఆ ఉత్సాహమే వేరు. అలాంటి న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అక్కడ ఉచితంగానే బంగారం దొరుకుతుందని ఎవరైనా చెప్తే నమ్మాలనిపించదు. కానీ నిజమే అంటున్నారు కొందరు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగుచోట్ల గోల్డ్ ఫ్రీగా లభిస్తుందట. కాగా ఇందులో రెండు ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయి. ముడి బంగారం గనుల ద్వారా వెలికి తీస్తారని తెలిసిందే. లోహాన్ని తీసి ప్రాసెస్ చేసిన తర్వాత అది నిజమైన గోల్డ్‌గా భావిస్తుంటారు. అయితే కెనడాలోని కిలోడైక్ నది కూడా బంగారు లోహాలకు నిలయంగా చెప్తుంటారు. ఈ నదిలో, దాని చుట్టు పక్కల తవ్వకాలు జరపడంవల్ల బంగారం ఫ్రీగా లభిస్తుందని, దీంతో చాలా మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెప్తున్నారు. అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో మిస్సోరి నదిలోని ఇసుకలో కూడా వజ్రపు రాళ్లు, బంగారు రేణువులు లభిస్తుంటాయి. స్థానికులు వీటిని సేకరించి అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తుంటారు.

ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా ఫ్రీగా బంగారం దొరికే రెండు నదులు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందులో ఒకటి స్వర్ణరేఖ నది కాగా, రెండవది దానికి ఉపనది అయిన కర్కారీ నది. స్వర్ణరేఖ నది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఈ రెండు నదులు కూడా ప్రవహిస్తున్నప్పుడు వాటి తీరం వెంబడి ఇసుకలో ముడి బంగారు రేణువులు దొరుకుతాయని, లోపల తొవ్వినా బంగారం లభిస్తుందని చెప్తారు. కాకపోతే ఈ ప్రదేశాల్లో లభించేది పూర్తిగా నిజమైన బంగారం కాదు. తర్వాత దానిని ప్రాసెస్ చేయాల్సి ఉంటుందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రజలు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.

Next Story

Most Viewed