బన్నీ రిజెక్ట్ చేశాడు.. రవి తేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఇదే

by Prasanna |
బన్నీ రిజెక్ట్ చేశాడు.. రవి తేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఇదే
X

దిశ, సినిమా : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా కంటే ముందు వచ్చిన పుష్ప ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తన నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ లైఫ్ మొత్తం మారిపోయింది.

గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ ఆర్య తో సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో “ఆర్య” మూవీ సెన్సేషనల్ హిట్. ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు హిట్ అయ్యాయి.

గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ చాలా కాలం ఖాళీగా ఉన్నాడు. చాలా కథలు విన్నా అవి నచ్చక సినిమా తీయలేదు. ఆ సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను భద్ర కథను బన్నీకి చెప్పాడు. ఈ కథ విన్న తర్వాత సినిమా చేయాలా వద్దా అనే డైలమాలో పడిన అల్లు అర్జున్ కి సుకుమార్ ఆర్య కథ చెప్పాడట. యూత్‌ని ఆకట్టుకునే కథను ఎంచుకుని ఆర్య చేసాడు. ఇక ఇదే కథను రవితేజకు వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పి చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed