- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా యాటిట్యూడ్ అలాగే ఉంటుంది మరీ.. సానియా సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి సానియా మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఫ్లాప్ హిట్లు.. చిన్నా, పెద్దా సినిమాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా ఇలా డిఫరెంట్ జానర్స్ ఎంచుకుంటూ తన నటనా ప్రయాణాన్ని పక్కాగా కొనసాగిస్తున్న సానియా మల్హోత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
‘‘చిన్నప్పటి నుంచి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమాలు చూసే పెరిగాను. ఆ హీరోతో నటించాలని అందరి కళ. కెరీర్ స్టార్టింగ్‌లోనే ‘జవాన్’ సినిమాలో అవకాశం వచ్చింది. నా కళ తీరింది. షారుఖ్ మూవీల్లోకి రాకముందు ఢిల్లీలోనే ఉండేవారు. ఢిల్లీకి అమ్మాయిని అని నన్ను షూటింగ్ సమయంలో షారుఖ్ బాగా చూసుకునేవారు. ఆయన కారులో తీసుకెళ్లి.. స్కూల్, కాలేజ్ కూడా చూపించారు.
ఈ మూవీలో ఆయనతో కలిసి వర్క్ చేసి ఆరుగురం ‘గుడ్ టు గో, చీఫ్’ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకున్నాం. వీడియో కాల్స్ లో అందరం మాట్లాడుకుంటాం. కానీ.. నేను ఒక స్టార్‌ను అనే అహం ఎప్పుడూ ఆయన చూపించలేదు. మనిషికి పెషెన్సీ చాలా అవసరం. ఎంత కష్టపడినా వేస్ట్. నిదానమే ప్రధానం అని పెద్దలు అంటారు.
నా యాటిట్యూట్ అలాగే ఉంటుంది. దారినపోయేవన్నీ నాపై వేసుకోను. నాకు సంబంధించిన విషయం అయితేనే నేను స్పందిస్తా. సినిమాల్లో అవకాశాలు రావట్లేదే ఏంటి? నా పరిస్థితి అని ఏం హైరానా పడిపోను. వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకుంటాను’’. అంటూ సానియా మల్హోత్రా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.