- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. పవన్‌కి కూడా మూడు పెళ్లిళ్లు అయ్యాయి కాబట్టి ఆయన ఆఫీసుకే వెళ్తానంటున్న లావణ్య
దిశ, సినిమా: ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమాయణం మ్యాటర్ హాట్ టాపిక్‌గా నడుస్తుంది. ఇక రోజుకో విషయం బయట పడుతుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. తనను రాజ్ తరుణ్ ప్రేమించి, సహజీవనం చేసి అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది లావణ్య. ఇక ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేసి ఆధారాలను సైతం పోలీసులకి సమర్పించింది. ఇందులో భాగంగానే లావణ్య కేసులో రాజ్ తరుణ్ ఎ1 గా మాల్వీ మల్హోత్రా ఎ2 గా మాల్వీ మయాంక్ ఎ3 గా చేర్చారు. ఇక హీరో రాజ్ తరుణ్ మాత్రం ఆమెతో నాకు సంబంధమే లేదు. నన్ను ఇరికించడం కోసం డ్రామాలు చేస్తుంది. ఆమెకు డ్రగ్స్ అలవాటు కూడా ఉంది. వేరే వాళ్ళతో ఎఫైర్ కూడా ఉందని అంటున్నాడు రాజ్ తరుణ్.
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు లావణ్య. ఆమె మాట్లాడుతూ.. దేవుళ్లలో శివుడు మనుషుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని అన్నారు. ఇప్పుడు ఆయనను కలిసి ఆయనకు రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేశాడని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు. పవన్‌కి కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి కానీ వాళ్ళని పవన్ గౌరవంగా, బాధ్యతగానే చూసుకుని ఉంటారు. కానీ రాజ్ తరుణ్ అలా కాదు నాకు , పిల్లలకు కనీసం తిండి తినడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని లావణ్య పేర్కొంది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.