- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బన్నీకి వార్నింగ్ ఇచ్చిన అయాన్.. పోలీసులకు చెబుతానంటూ..
దిశ, సినిమా : టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గురించి సుపరిచితమే. తెలుగు సినీ రంగంలో బన్నీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.బన్నీ గంగోత్రి మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, ఆర్య లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో బన్నీ డాన్స్ కి ఫ్యాన్స్ ఎక్కువే. అల్లు అర్జున్,స్నేహ రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరిద్దరి ప్రేమకి గుర్తుగా అయాన్,అర్హ జన్మించారు. అయితే బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ముఖ్యంగా మన ఐకాన్ స్టార్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి మాత్రం తప్పనిసరిగా టైం ఇస్తాడు. ఫ్యామిలీతో చాలా సంతోషంగా, సరదగా గడుపుతాడు. ముఖ్యంగా తన కూతురు అయాన్, అర్హతో ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ, వారికి సంబంధించిన ఫొటోస్,వీడియోస్‌ను తమ అభిమానులతో పంచుకుంటాడు.
అయితే తాజాగా అల్లు అయాన్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. అల్లు అయాన్ మెడలో కుర్తి తో మోడలింగ్ చేస్తూ కనిపించాడు. ఇక ఈ మధ్య అయాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడని, ముఖ్యంగా పుష్ప2లో ఆయన కనిపించబోతున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అయాన్‌కు సంబంధించిన చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అయాన్‌కు సంబందించిన ఓ వీడియోను అల్లు అర్జున్ పోస్ట్ చేయగా అది చాలా ట్రెండ్ అవుతుంది. అందులో సామ్ జామ్ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ అయాన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపాడు.
ఆయన మాట్లాడుతూ.. ఒకసారి అయాన్ అల్లరి చేస్తే చెయ్యి ఎత్తాను. దీంతో అయాన్ సీరియస్‌గా చూస్తూ..నన్ను కొట్టాలని చూస్తున్నావా? అమెరికాలో పిల్లలను కొడితే, పోలీసులకు ఫోన్ చేస్తారని తెలుసా? అంటూ సీరియస్ గా అడిగాడు. దీంతో ఒక్కసారిగా షాకైన నేను అదేం లేదురా బాబు, నేను ఏదో సరదాగా అన్నాను అంటూ చెప్పుకొచ్చానని చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో బన్నీ పోస్ట్ చేయగా, ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.