అనుష్క చేసిన పనికి తీవ్రంగా మండిపడుతోన్న ప్రభాస్.. లైఫ్‌లో క్షమించగలడా? ఆందోళనలో ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2024-03-22 07:45:02.0  )
అనుష్క చేసిన పనికి తీవ్రంగా మండిపడుతోన్న ప్రభాస్.. లైఫ్‌లో క్షమించగలడా? ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-అనుష్క జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వీరిద్దరు మిర్చి, బాహుబలి పార్ట్-1, 2 చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని కోట్లాది మంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభాస్-అనుష్క పెళ్లై.. ఓ బాబు కూడా జన్మించినట్లు ఏఐ ద్వారా క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన రెబల్ స్టార్, స్వీటీ మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని వెల్లడించారు. అయినప్పటికీ ఫ్యాన్స్ వీరి మాటలు పట్టించుకోకుండా పాన్ ఇండియా స్టార్.. అనుష్క పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని కలలు కంటున్నారు. సోషల్ మీడియా వేదికన ఎన్నో సార్లు రెకమెండ్ కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా అనుష్క పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

కొన్నేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. సైజ్ జీరో వంటి సినిమాలో నటించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. గతంలో వేదం చిత్రంలో నటించి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యింది. అంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన అనుష్కపై దారుణంగా మండిపడుతున్నారు.

అనుష్క శెట్టి క్రిష్ దర్శకత్వంలో వేశ్య పాత్రలో నటించబోతుందని సమాచారం. ఇందులో టు మచ్ బోల్డ్ గా సెక్సీగా కనిపించనుందట. ఈ చిత్రం ట్రూ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. కాగా అనుష్క-ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలనుకుంటోన్న ఫ్యాన్స్ స్విటీని వేశ్య క్యారెక్టర్ లో అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. మరోవైపు ప్రభాస్ కూడా ఈ విషయంలో అనుష్క పై కోపంగా ఉన్నట్లు నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read More..

జనసేన నుంచి నగరి MLAగా పోటీ చేస్తున్న అనుష్క.. టెన్షన్‌లో రోజా!

Advertisement

Next Story

Most Viewed